ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో బంగారు ఆభరణాలు శుభ్రం చేయడానికి లిక్విడ్ సబ్బు, డిటర్జెంట్ లేదా మార్కెట్‌లో దొరికే కెమికల్ క్లీనర్లు వాడుతున్నారు. సమయం ఆదా అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. మొదటిసారి కడిగినప్పుడు నగలు చాలా మెరిసినట్టు కనిపిస్తాయి కూడా. కానీ ఆ మెరుపు ఎక్కువకాలం నిలవదు అన్న విషయం చాలామందికి తెలియదు.
ఇలాంటి సబ్బులు, కెమికల్స్ బంగారు ఉపరితలంపై ఉన్న సహజ పొలిష్‌ను మెల్లగా తొలగిస్తాయి. దాంతో కొంతకాలానికి నగలు మసకగా కనిపించడం, చిన్న చిన్న గీతలు పడటం, రంగు తేడా రావడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సబ్బు అవశేషాలు నగల లోపలి మూలల్లో నిలిచిపోవడం వల్ల మచ్చలు కూడా ఏర్పడతాయి. వాటిని తర్వాత శుభ్రం చేయడం చాలా కష్టం అవుతుంది.
ముఖ్యంగా రాళ్లు అమర్చిన ఆభరణాలకు ఈ కెమికల్స్ మరింత హాని చేయవచ్చు. రాళ్ల చుట్టూ ఉన్న అంటుకునే పదార్థం బలహీనపడటం, రాళ్లు లూజ్ కావడం, మెరుపు తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా తెలియకుండానే మనం విలువైన ఆభరణాలకు నష్టం చేస్తున్నాం అనే విషయం చాలామందికి అర్థం కావడం లేదు.
అందుకే బంగారు ఆభరణాలను శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కెమికల్స్ కాకుండా సహజమైన, సురక్షితమైన పద్ధతులు ఎంచుకుంటే నగల అందం కూడా కాపాడుకోవచ్చు, వాటి ఆయుష్షు కూడా పెరుగుతుంది.ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
1.కుంకుడుకాయ రసం
కుంకుడుకాయతో బంగారు ఆభరణాలు Clean చేయడం (Step-by-Step)
అవసరమైనవి
-
1 లేదా 2 కుంకుడుకాయలు
-
గోరువెచ్చని నీరు (హాట్ కాదు)
-
చిన్న బౌల్
-
సాఫ్ట్ టూత్‌బ్రష్ (లేదా సాఫ్ట్ కాటన్ క్లాత్)
-
మృదువైన గుడ్డ (తుడవడానికి)
1: కుంకుడుకాయ సిద్ధం చేయండి
-
కుంకుడుకాయను చిన్న చిన్న ముక్కలుగా కోయండి
లేదా -
పగలగొట్టి లోపలి గింజలు తీసేసి తొక్క/పల్ప్ భాగం వాడండి.
2: కుంకుడుకాయ రసం తయారు చేయండి
-
బౌల్‌లో గోరువెచ్చని నీరు పోయండి.
-
అందులో కుంకుడుకాయ ముక్కలు వేసి 15–20 నిమిషాలు నానబెట్టండి.
-
నీరు కొద్దిగా పాలు రంగులో లేదా మబ్బుగా మారుతుంది — అదే “కుంకుడుకాయ రసం”.
కావాలంటే చేతితో మెల్లగా నలిపితే రసం ఇంకా బాగా వస్తుంది.
3: ఆభరణాలను నానబెట్టండి
-
బంగారు ఆభరణాలను ఆ రసంలో వేసి 10 నిమిషాలు ఉంచండి.
-
చాలా మురికి ఉంటే 15 నిమిషాలు వరకు ఉంచొచ్చు.
రాళ్లు ఉన్న నగలైతే 10 నిమిషాలు చాలు.
See also: తలలో పేను పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
4: మెల్లగా శుభ్రం చేయండి
-
ఆభరణాలను బయటకి తీసి
సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో (లేదా క్లాత్‌తో)
చెయిన్ లింక్స్, మూలలు, డిజైన్ గ్యాప్స్ దగ్గర మెల్లగా రుద్దండి. -
గట్టిగా రుద్దకండి.
5: శుభ్రమైన నీటితో కడగండి
-
ఇప్పుడు ఆభరణాలను సాధారణ శుభ్రమైన నీటితో బాగా కడగండి.
-
కుంకుడుకాయ అవశేషాలు మిగలకుండా చూసుకోండి.
6: పూర్తిగా పొడిగా తుడవండి
-
సాఫ్ట్ డ్రై క్లాత్‌తో పూర్తిగా తుడవండి.
-
తర్వాత 10 నిమిషాలు గాలిలో ఉంచండి (మాయిశ్చర్ పోయేలా).
ఇలా చేస్తే మెరుపు నేచురల్‌గా వస్తుంది.
Saa Also: పీరియడ్స్ టైమ్‌లో కడుపు నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు
(చాలా మురికి ఉన్నప్పుడు)
-
కుంకుడుకాయ రసం తయారు చేసిన తర్వాత
ఆ రసాన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉంచి నానబెట్టితే క్లీనింగ్ ఇంకా బాగుంటుంది.
(హాట్ చేయొద్దు)
