ఈ రోజుల్లో మన ఫోన్‌లో ఎన్నో apps ఉంటాయి. Netflix, Amazon Prime, Hotstar, Spotify, Cloud Storage, Learning Apps ఇలా ఒక్కొక్కటి నెలకు చిన్న మొత్తమే కట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ అన్ని కలిపితే నెలకు వెయ్యి రూపాయలు పైగా ఖర్చు అవుతుంటుంది. చాలామంది ఒకసారి ట్రయల్ తీసుకుని మర్చిపోతారు. ప్రతి నెలా ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అవుతూనే ఉంటుంది.
మీరు నిజంగా ఉపయోగించని subscriptions ని cancel చేస్తే సంవత్సరానికి వేల రూపాయలు సేవ్ చేయవచ్చు. ఇప్పుడు step by step గా ఎలా చెక్ చేయాలి, ఎలా cancel చేయాలి, ఇంకా future లో డబ్బు వృథా కాకుండా ఎలా manage చేయాలో చూద్దాం.
మీ ఫోన్‌లో Active Subscriptions ఎలా చెక్ చేయాలి?
ఇక్కడ ఉదాహరణగా, PhonePe App లో ఉన్న AutoPay ప్రాసెస్ ద్వారా Active subscriptions ఎలా చూడాలో స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకుందాం.
Step-by-Step విధానం:
- PhonePe App ఓపెన్ చేయండి
- Home Screen లో కింద భాగంలో ఉన్న Profile / Menu ఐకాన్ పై క్లిక్ చేయండి
- ఇప్పుడు Scroll చేస్తే Manage Payments అనే ఆప్షన్ కనిపిస్తుంది
- అక్కడ More Options సెక్షన్ లో AutoPay పై టాప్ చేయండ
ఇప్పుడు మీకు అన్ని Ongoing AutoPay subscriptions లిస్ట్ కనిపిస్తుంది
ఉదాహరణ: JioHotstar , Amazon Prime, Netflix
- మీరు ఏ subscription ఎంత amount కట్ అవుతుందో కూడా ఇక్కడ చూడవచ్చు
అవసరం లేని Subscription Cancel చేయడం ఎలా?
- PhonePe → AutoPay → Ongoing ఓపెన్ చేయండి
- Cancel చేయాలనుకున్న subscription పై టాప్ చేయండి
- AutoPay Details స్క్రీన్ ఓపెన్ అవుతుంది
- కింద ఉన్న Delete AutoPay పై టాప్ చేయండి
- Confirm చేయండి
అంతే — ఇకపై ఆ subscription కి ఆటోమేటిక్‌గా డబ్బు కట్ కాదు.
నెలకు ఎంత డబ్బు సేవ్ అవుతుందో లెక్క ఎలా వేయాలి?
ఒక్కొక్క subscription చిన్నదిగా అనిపించినా మొత్తం పెద్ద మొత్తమే అవుతుంది.
ఉదాహరణ:
OTT App – ₹199 / నెల
Music App – ₹119 / నెల
Cloud Storage – ₹149 / నెల
Learning App – ₹299 / నెల
మొత్తం: ₹766 / నెల
సంవత్సరానికి: ₹9,192 సేవింగ్
ఈ డబ్బుతో మీరు emergency fund, పిల్లల education, లేదా చిన్న investment చేయవచ్చు.
Future లో మళ్లీ డబ్బు వృథా కాకుండా ఉండాలంటే
Free Trial తీసుకున్న వెంటనే Reminder పెట్టండి
- Calendar లేదా Alarm లో trial ముగిసే తేదీకి reminder పెట్టండి.
ఒకే Category లో ఒకే App మాత్రమే వాడండి
- Music కి ఒక app, OTT కి ఒక app చాలు.
Family Plans ఉపయోగించండి
- Netflix, YouTube, Spotify లో family sharing ఉంటుంది.
నెలకు ఒకసారి Subscriptions Review చేయండి
- ప్రతి నెల 5 నిమిషాలు కేటాయిస్తే చాలును.
Subscription Fraud నుంచి ఎలా జాగ్రత్త పడాలి?
Unknown apps కి card details ఇవ్వవద్దు
Official Play Store / App Store నుంచే install చేయండి
Bank SMS alerts enable చేసుకోండి
అనుమానాస్పద deduction ఉంటే వెంటనే bank కి contact చేయండి




