పులిపిర్లు అనేవి చాలామందికి సాధారణంగా ఎదురయ్యే చర్మ సమస్య. చేతులు, కాళ్లు, మెడ, ముఖం లేదా పాదాలపై చిన్న గడ్డలుగా మొదలై క్రమంగా ఇబ్బంది కలిగిస్తాయి. మొదట నొప్పి లేకపోయినా, చూడడానికి అసహ్యంగా అనిపించడం వల్ల చాలామంది టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గేలా చేస్తాయి.
చాలాసార్లు పులిపిర్లు ఎందుకు వస్తాయో తెలియక ఇంట్లోనే గీకడం, కత్తిరించడం లాంటి పనులు చేస్తారు. అలా చేయడం వల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు ఇతరులకు కూడా అంటుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ఇంట్లోనే సులభంగా తగ్గించవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి, సరైన పద్ధతిలో సహజమైన చిట్కాలు పాటిస్తే పులిపిర్లు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ ఆర్టికల్‌లో పులిపిర్లు ఎందుకు వస్తాయి, వాటిని శాశ్వతంగా తగ్గించడానికి ఇంట్లోనే పాటించగల సింపుల్ చిట్కాలు, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా తెలుసుకుందాం. రోజువారీ జీవితం లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో ఎలా ఉపశమనం పొందాలో ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయి.
1) వెల్లుల్లి వాడకం
వెల్లుల్లిలో సహజంగా ఉండే anti-viral లక్షణాలు పులిపిర్లకు కారణమైన వైరస్‌పై పని చేస్తాయి.
ఒక వెల్లుల్లి రెబ్బను మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి, పులిపిర్ మీద నేరుగా రాయాలి. తర్వాత చిన్న కాటన్ లేదా బ్యాండేజ్‌తో కవర్ చేయాలి. రోజుకు ఒకసారి, ముఖ్యంగా రాత్రి వేళ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 7 నుంచి 10 రోజులు చేస్తే పులిపిర్ ఎండిపోయి చిన్నదవుతుంది.
2) అరటి తొక్క చిట్కా
అరటి తొక్క లోపలి భాగంలో ఉండే సహజ ఎంజైమ్స్ పులిపిర్లను మెల్లగా తగ్గించడంలో సహాయపడతాయి.
రాత్రి పడుకునే ముందు అరటి తొక్క లోపలి భాగాన్ని పులిపిర్ మీద ఉంచి, టేప్‌తో తేలికగా కట్టాలి. ఉదయం లేవగానే తీసేయాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే పులిపిర్ మృదువుగా మారి తగ్గడం మొదలవుతుంది.
See Also: తెల్ల జుట్టు నల్లగా మారే సహజ ఇంటి చిట్కాలు
3) ఆపిల్ సైడర్ వినిగర్
ఆపిల్ సైడర్ వినిగర్ పులిపిర్‌ను లోపల నుంచి ఎండబెట్టే గుణం కలిగి ఉంటుంది.
కాటన్ ముక్కలో కొద్దిగా వినిగర్ తీసుకుని పులిపిర్ మీద ఉంచాలి. రోజుకు ఒక్కసారి చాలు. మొదట కొంచెం మంటగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ నొప్పి ఉంటే వెంటనే ఆపాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు వినిగర్‌ను కొద్దిగా నీటితో కలిపి వాడటం మంచిది.
4) కాస్టర్ ఆయిల్ మసాజ్
కాస్టర్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా ఉంచి పులిపిర్ గడ్డ క్రమంగా తగ్గేలా చేస్తుంది.
రోజుకు రెండు సార్లు కాస్టర్ ఆయిల్‌తో పులిపిర్‌పై మెల్లగా మసాజ్ చేయాలి. ఇది వెంటనే ఫలితం ఇవ్వదు, కానీ కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
5) టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ ఒక మంచి natural antiseptic. ఇది చర్మంపై ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది.టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా కాకుండా కొద్దిగా నీరు లేదా కేరియర్ ఆయిల్‌తో కలిపి పులిపిర్‌పై అప్లై చేయాలి. రోజుకు ఒకసారి చేస్తే సరిపోతుంది. ముఖం లేదా మెడ లాంటి సున్నితమైన భాగాల్లో చాలా జాగ్రత్తగా వాడాలి.
See Also: పెను కోరుకుడు తగ్గించే ఇంటి చిట్కాలు..
పులిపిర్లు రావడానికి ప్రధానంగా వైరస్ + ఇమ్యూనిటీ లోపం + శుభ్రత లోపం కలిసే కారణం. అందుకే కేవలం బయట రాసే మందులు కాకుండా, శరీరాన్ని లోపల నుంచి బలంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
