పెళ్లి తర్వాత కొత్త ఇంటికి అడుగుపెట్టిన ప్రతి అమ్మాయికి వంటగది ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంటి సభ్యుల రుచులు, వారి అలవాట్లు, సమయానికి వంట పూర్తిచేయడం – ఇవన్నీ మొదట్లో కాస్త టెన్షన్ కలిగిస్తాయి. “కూర బాగాలేదంటే ఏం అనుకుంటారో?”, “ఉప్పు ఎక్కువైపోతే?” అనే చిన్న చిన్న ఆందోళనలు సహజం.
కానీ నిజానికి వంట అనేది ఒక్కరోజులో నేర్చుకునే విషయం కాదు. ప్రతి ఇంటి రుచికి తగినట్టు కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటే చాలు. చిన్న చిట్కాలు తెలిసి ఉంటే పెద్ద తప్పులు కూడా సులభంగా సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వాళ్లకు ఈ వంటింటి చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.ఇప్పుడు అలాంటి సులభమైన, ఉపయోగకరమైన వంటింటి టిప్స్ తెలుసుకుందాం.
1.ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి?
* కొద్దిగా నీరు లేదా ఉడికించిన ఆలుగడ్డ ముక్క వేసితే ఉప్పు తగ్గుతుంది.
2. కారం ఎక్కువైపోతే?
*పెరుగు లేదా కొబ్బరి పాలు కొద్దిగా కలిపితే కారం బ్యాలెన్స్ అవుతుంది.
3. అన్నం మెత్తగా కాకపోతే?
* అన్నం ఉడకకపోతే కొద్దిగా వేడి నీరు పోసి మళ్లీ ఉడికించాలి.
See Also: ఇత్తడి పాత్రలు, గిన్నెలు మెరిపించేందుకు సులభమైన ఇంటి చిట్కాలు
4. పప్పు త్వరగా ఉడకడానికి
* కుక్కర్‌లో పప్పు వేయేముందు కొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తే త్వరగా ఉడుకుతుంది.
5. కూరలు రంగు మారకుండా ఉండాలంటే
* ఆకుకూరలు వండేటప్పుడు చివర్లోనే ఉప్పు వేయాలి.
See Also: వంటగదిలో చీమలు రాకుండా ఉండడానికి 7 సులభ చిట్కాలు
6. నూనె ఎక్కువగా పడకుండా
* నూనె వేయేముందు పాత్ర బాగా వేడెక్కాక వేయాలి.
అప్పుడే తక్కువ నూనె సరిపోతుంది.
7. పాలు పొంగిపోకుండా
* పాలు మరిగేటప్పుడు పాత్ర అంచులకు కొద్దిగా నూనె రాయాలి.
8. టమాటాలు ఎక్కువ పుల్లగా ఉంటే
* కొద్దిగా చక్కెర లేదా క్యారెట్ ముక్క వేస్తే పులుపు తగ్గుతుంది.
9. కూరలు అంటిపడకుండా
* పాత్ర వేడి అయ్యాకే కూరగాయలు వేయాలి.
చల్లని పాత్రలో వేస్తే అంటిపడతాయి.
10. రోజూ వంట సులభం కావాలంటే
* ఉల్లిపాయలు, టమాటాలు ముందే తరిగి
* మసాలాలు చిన్న డబ్బాల్లో రెడీగా ఉంచుకుంటే
రోజూ వంట చాలా ఈజీ అవుతుంది.
See Also: ఆయిల్ (Oil) డబ్బాను సులభంగా క్లీన్ చేసే చిట్కాలు (Simple Tips)
11. చపాతీలు గట్టిగా అయితే?
* వేడి ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి రాసి మూత పెట్టితే మృదువుగా మారుతాయి.
12. వంకాయ లేదా అరటి ముక్కలు నల్లబడకుండా
* తరిగిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో వేసి ఉంచాలి.
13. పప్పు లేదా సాంబార్ ముద్దగా అయితే?
* కొద్దిగా వేడి నీరు పోసి బాగా కలపాలి.
ఒక్కసారిగా ఎక్కువ నీరు వేయకూడదు.
14. ఆవాల తాలింపు చేదుగా అయితే?
* ఆవాలు వేయగానే వెంటనే మిగతా పదార్థాలు వేయాలి.
ఎక్కువ కాలం వేడి నూనెలో ఉంటే చేదుగా మారుతుంది.
కొత్తగా పెళ్లైనవాళ్లకు వంటింటి అనుభవం మొదట కాస్త కష్టంగా అనిపించవచ్చు.
కానీ ఈ చిన్న చిట్కలు పాటిస్తే వంట కూడా ఆనందంగా మారుతుంది.
